
అనధికారిక నల్లాలను గుర్తించండి
వరంగల్ అర్బన్: నగరంలోని అనధికారిక నల్లాలను గుర్తించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 12వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన నల్లా.. కలెక్షన్లు’ కథనానికి కమిషనర్ స్పందించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాధికారులతో సమావేశమయ్యారు. నగరవ్యాప్తంగా సుమారు 70 వేల నల్లా కనెక్షన్లు (అనధికారికంగా, ఒక ఇంటికి ఒకటికి మించి, ఇంటి నంబర్లు లేకున్నా కనెక్షన్, అపార్టుమెంట్‌ల్లోని ప్లాట్లకు) ఉన్నట్లు పన్ను జనరేట్ అవుతోందని తెలిపారు. రెసిడెన్షియల్ నల్లా తీసుకుని కమర్షియల్‌గా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా 4 కేటగిరీలుగా నల్లాలను గుర్తించేందుకు 11 బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఒక్కో ఏరియా పరిధిలో సుమారు 3 వేల గృహాలను క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సిందేనని ఆదేశించారు. సమాచారం నమోదుచేయాలని ఇందుకు సంబంధించిన ప్రొఫార్మా తయారు చేయాలని ఐటీ మేనేజర్‌ను కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈ మాధవీలత పాల్గొన్నారు.
9 జోన్లు, 13 సబ్ జోన్లుగా యూజీడీ
వరంగల్ నగరవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్ (యూజీడీ)ని 9 జోన్లుగా, 13 సబ్ జోన్లుగా, 23 ఎస్టీపీలు, 7 సీవరేజ్ పంపింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌పై క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలపై ఇంజనీర్లు అధ్యయనం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయంలో యూజీడీ డీపీఆర్‌పై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ అనంతరం ఆమె సమీక్షించారు. డిజైన్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పాల్గొన్నారు.
11 ప్రత్యేక బృందాల ఏర్పాటు
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్

అనధికారిక నల్లాలను గుర్తించండి