
బాధ్యత మరిచి మాట్లాడుతున్న భట్టి
హన్మకొండ: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు బన్న ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా.. హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా కొలను సంతోశ్‌రెడ్డి, బన్న ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సండ్ర మధు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూథర్, ఎస్టీ మోర్చా నాయకుడు నానునాయక్, నాయకులు శ్రీనివాస్, శివకుమార్, వెంకటేశ్, బొచ్చు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
కొలను సంతోశ్‌రెడ్డి
ఉపముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం