
హరిత పాఠశాల.. పోచంపల్లి..
విద్యారణ్యపురి : శాయంపేట మండలం పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇది. 2023 డిసెంబర్‌లో జి.ఉప్పలయ్య అనే ప్రధానోపాధ్యాయుడు రాకతో ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. విద్యార్థుల నమోదుపై దృష్టిపెట్టడమే గాకుండా పాఠశాలలో హరితం తమ పంతం అనే విధంగా తన సహచర ఉపాధ్యాయులతో కలిసి హరితవనంగా మార్చేశారు. ఇప్పటివరకు సుమారుగా 900కు పైగా మొక్కలు నాటించారు. అందులో 120 రావి, 130 వేప, పొగడ 150 వరకు మొక్కలు నాటించారు. మిగితావి వివిధ రకాల మొక్కలతోపాటుగా పూల మొక్కలు ఉన్నాయి. షో, పూలమొక్కలు, రాయల్ ఫార్మ్, బోగన్ విలియి, టెంపుల్ ట్రీస్, మహాగని ట్రీస్, యూఫర్ బియా మొక్కలను జిల్లా రెవెన్యూ అధికారి గణేష్ ఇప్పించి నాటించారు. వీటి సంరక్షణకు ఇద్దరు వర్కర్లను పెట్టుకుని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు సొంతంగా వేతనాలు ఇస్తున్నారు.