
మరమ్మతులు చేసి ఆధునికీకరించాలి
చారిత్రాత్మక పాకాల చెరువు ఆయకట్టు రైతుల పంటలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే కాల్వలు, తూముల మరమ్మతులు చేసి ఆధునికీకరణ పనులు చేపట్టాలి. పాకాల చెరువు కింద అధికారికంగా, అనధికారికంగా సుమారు 50వేల ఎకరాల వరి పంట సాగు అవుతుంది. సరిపడా సాగునీటిని అందించేందుకు ఉన్న తుంగబంధం, జాలుబంధ, సంగెం కాల్వలు పిచ్చి మొక్కలు చెట్లతో నిండిపోయాయి. పలుచోట్ల తెగిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. దీంతో సాగునీరు పారించడం రైతులకు ఇబ్బందిగా మారింది. గతంలో నాణ్యతతో పనులు చేయకపోవడంతో త్వరగా పాడయ్యాయి. ఇప్పటికై నా తగినవిధంగా బడ్జెట్ కేటాయించి, మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలి.
– పెద్దారపు రమేష్, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి