
మల్కాపూర్ ప్రజలరా మీకు పాదాభివందనం
ఐదేళ్ల కూతురితో భర్త ఇంటి ఎదుట ఫ్లెక్సీతో భార్య నిరసన
వరంగల్: భర్తతోనే (అతడి తల్లిదండ్రులు కాకుండా) కలిసి ఉండేలా తనకు న్యాయం చేయాలని ఓ ఇల్లాలు భర్త ఇంటి ఎదుట తన తల్లిదండ్రులు, ఐదేళ్ల కూతురితో కలిసి ఆదివారం నిరసన చేపట్టింది. మల్కాపూర్ గ్రామానికి చెందిన సాంబారి రాజేశ్వర్, మణెమ్మ దంపతులకు విద్యాసాగర్ ఒక్కడే కుమారుడు. ఆరేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా ములు గు ఘణపురం గ్రామానికి చెందిన వెంకటనారాయణ కుమార్తె తేజస్వినితో పెళ్లి జరిపించారు.
దంపతులు కొంతకాలం క్రితం వరకు అన్యోన్యంగా ఉండేవారు. అయితే మల్కాపూర్ వచ్చిన నాటి నుంచి తేజస్వినిని ఏదో రకంగా అత్తామామ ఇబ్బంది పెట్టేవారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కోర్టు వరకు వెళ్లింది. అయినా విద్యాసాగర్ తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం తేజస్విని తన తల్లిదండ్రులతో పాటు కూతురితో కలిసి మల్కాపూర్ గ్రామానికి వచ్చింది. ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నవీన్‌కుమార్ ఆదేశంతో కానిస్టేబుల్ చారి అక్కడకు వెళ్లి గొడవ జరగకుండా చేశారు.