
పెరిగిన భూగర్భ జలాలు
హన్మకొండ: భూగర్భ జలాలు గత రెండు నెలలుగా స్వల్పంగా పెరిగాయి. యాసంగి సాగు పంటలు చేతికి రావడంతో భూగర్భ జలాల వినియోగం పెరుగుతూ వస్తోంది. రుతు పవనాలకు ముందు మే నెల చివర్లో జిల్లాలో 6.14 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా జూన్ మాసాంతానికి 5.98 మీటర్లుగా నమోదైంది. ఏప్రిల్ చివరినాటికి 6.21 మీటర్లు భూగర్భ జలమట్టం ఉండగా.. మే, జూన్ చివరినాటికి స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ మాసంతో సగటు భూగర్భ జలమట్టం పరిశీలిస్తే జిల్లాలో స్వల్పంగా పెరిగింది.
నీటి వినియోగం పెరిగే అవకాశం
ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జలమట్టాన్ని ఫీజో మీటర్ల ద్వారా రికార్డు చేస్తారు. వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో వరద నీరు చేరితే భూగర్భ జలాలు మరింత పెరుగుతాయి. వర్షాలు కురవక వరి సాగుకు భూగర్భ జలాలు తోడితే భూగర్భ జలాలు పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం రైతులు మెట్ట పంటల సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. వరి సాగు కోసం రైతులు నారు పోస్తున్నారు. నారు ఎదిగే కొద్ది పొలం దమ్ము చేస్తే భూగర్భ జలాల వినియోగం పెరిగే అవకాశముంది. ఈమేరకు వర్షాలు సమృద్ధిగా కురవకపోతే రైతులు పూర్తిగా భూగర్భ జలాల మీద ఆధారపడాల్సిందే. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే వర్షం దోబూచులాడుతోంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. మెట్ట పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ముందుగా విత్తిన మెట్ట పంటల మొలకలు ఎండిపోతున్న దశలో సుమారు పది రోజుల క్రితం కురిసిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం జీవం పోసింది. ఇప్పటి వరకు వరదలు పారే వర్షం కురువలేదు. దీంతో రైతులో ఆందోళన చెందుతున్నారు.
భూగర్భ జలమట్టం వివరాలు
ప్రాంతం ఏప్రిల్ మే జూన్
చెన్నారావుపేట 1.83 1.56 1.46
దుగ్గొండి 3.95 4.85 4.71
గీసుకొండ 5.54 5.25 5.03
వంచనగిరి 5.83 5.50 5.25
ఖానాపురం 3.62 3.78 3.34
నారక్కపేట 7.78 7.64 7.70
నర్సంపేట 4.66 4.73 4.97
అమీన్‌పేట 2.39 243 2.85
నాగారం 5.50 5.61 5.42
అన్నారం షరీఫ్ 12.33 11.51 11.65
పర్వతగిరి 12.83 12.02 11.83
కూనూరు 8.69 7.83 8.06
రాయపర్తి 5.02 8.40 8.42
సంగెం 6.68 3.70 3.58
తీగరాజుపల్లి 12.52 11.82 11.62
వర్ధన్నపేట 8.36 9.27 8.30
చార్‌బౌళి 3.15 2.75 2.22
మామునూరు 4.61 4.85 4.65
లోహిత 11.61 10.70 10.56
ఇల్లంద 6.15 6.34 6.75
రెడ్లవాడ 0.9 1.55 1.65
ఉప్పరపల్లి 4.67 4.50 3.64
మంగళవారిపేట 5.62 5.72 4.9
మేడపల్లి 4.89 5.17 5.32
నాగూర్లపల్లి 4.23 4.13 4.41
రేకంపల్లి 8.09 8.13 7.30
జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 5.98 మీటర్లు
మెట్ట పంటల సాగులో రైతుల బిజీ
వరిసాగు ముమ్మరమైతే పెరగనున్న
నీటి వినియోగం