మడికొండ: మడికొండ శివారులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం)లో ఎటుచూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్లుగా ఉంటుంది. కార్యాలయం ముందు ఏపుగా పెరిగిన అశోక చెట్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. హరిత హారంలో భాగంగా ఇప్పటి వరకు నిమ్మ, పనస, టేకు, సపోటా, మామిడి, నారింజ, అలోవేర, బత్తాయి, 30 రకాల మొక్కలు 400లకు పైగా నాటినట్లు ప్రాంగణం జిల్లా మేనేజర్ జయశ్రీ తెలిపారు. ఈ కేంద్రంలో బ్యుటీషియన్, టైలరింగ్, డీటీపీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ తదితర కోర్సుల్లో మహిళలు శిక్షణ పొందుతుంటారని, వారి కోసం పూలు, పండ్ల మొక్కలను నాటుతున్నామని పేర్కొన్నారు.
హరిత ప్రాంగణం