పంటల సాగులో యూరియా తక్కువ వాడాలి | - | Sakshi
Sakshi News home page

పంటల సాగులో యూరియా తక్కువ వాడాలి

Jul 9 2025 6:20 AM | Updated on Jul 9 2025 6:20 AM

పంటల

పంటల సాగులో యూరియా తక్కువ వాడాలి

డీఏఓ అనురాధ

నర్సంపేట: రైతులు తమ పంటలకు యూరియాను తక్కువ మోతాదులో వాడాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ అన్నారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్‌ సహకార సంఘాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గోదాంలోని స్టాక్‌ రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు తమకు అవసరం ఉన్న మేరకే యూరియాను తీసుకెళ్లాలన్నారు. యూరియా దొరకదనే నెపంతో కొంత మంది రైతులు ఇళ్లలో యూరియాను స్టాక్‌ చేసుకుంటున్నారని అది సరికాదన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మర్‌ మురహరి రవి, సొసైటీ సిబ్బంది ఎల్లయ్య, అశోక్‌, ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

వంద శాతం

ఉత్తీర్ణత సాధించాలి

కస్తూర్బా పాఠశాలను

సందర్శించిన డీఈఓ

పర్వతగిరి: టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ జ్ఞానేశ్వర్‌ అన్నారు. పర్వతగిరి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులు, మౌలి క వసతులను పరిశీలించారు. ప్రతీ తరగతి గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులను ప్రశ్న లు అడిగారు. పాఠశాలలో అందిస్తున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గాయపు లింగారెడ్డి, పర్వతగిరి కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్‌ పాక రమేష్‌బాబు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం స్పెషల్‌ ఆఫీసర్‌ నాజియాసల్మా, సీఆర్పీ భూక్య శ్రీని వాస్‌, సీసీఓ గారె జయరాజ్‌ పాల్గొన్నారు.

విద్యార్థులు చెడు వ్యసనాలకు

దూరంగా ఉండాలి

ఖానాపురం: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికారి మురళీధర్‌రావు అన్నారు. మండలంలోని అశోక్‌నగర్‌, ఖానాపురం, బుధరావుపేటతోపాటు పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువే ప్రధాన ఆయుధమన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నతులుగా ఎదుగుతారని తెలిపారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదువుకోవాలని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని సూచించారు. టీవీలు, సెల్‌ఫోన్‌లకు విద్యార్థులు దూరంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమాల్లో డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీఓ సునీల్‌కుమార్‌, ఎకై ్సజ్‌ సీఐ నరేష్‌రెడ్డి, ఎంఈఓ శ్రీదేవి, ఎస్‌ఓ మేనక, రిటైర్డ్‌ హెచ్‌ఎం రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి

సూపరింటెండెంట్‌గా అపర్ణ

నర్సంపేట రూరల్‌: నర్సంపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ అపర్ణకు ప్రమోషన్‌ కల్పిస్తూ డైరెక్టర్‌ ఆఫర్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ నుంచి మంగళవారం జాబితా విడుదలైంది. ఇప్పటివరకు నర్సంపేట ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రిలో పాథాలజి డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ కిషన్‌కు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించారు. ఆ స్థానంలో వరంగల్‌ కేఎంజీ/ఎంజీఎం పిడియాక్రిక్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ అపర్ణను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి రెగ్యూలర్‌ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్వర్తులు జారీ చేశారు.

పంటల సాగులో  యూరియా తక్కువ వాడాలి1
1/2

పంటల సాగులో యూరియా తక్కువ వాడాలి

పంటల సాగులో  యూరియా తక్కువ వాడాలి2
2/2

పంటల సాగులో యూరియా తక్కువ వాడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement