
మహాశాకంబరీ ఏర్పాట్లపై సమీక్ష
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న మహాశాకంబరీగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా గురువారం కార్యాలయంలో ఈఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ధర్మకర్తలు, మట్వాడ సీఐ గోపి, ట్రాఫిక్ ఎస్సై సాయికిరణ్ పాల్గొని దేవాలయాన్ని పరిశీలించి శాకంబరీ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు క్యూలైన్లు, తాగునీటి వసతి, బాదంమిల్క్, మజ్జిగ పంపిణీ, అదనంగా ప్రసాదాల విక్రయకౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాలిటెక్నిక్ కళాశాల పక్కన ప్రవేశించి దర్శనం అనంతరం కాపువాడ మీదుగా బయటకు వెళ్లాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా ఈఓ శేషుభారతి దేవాలయంలో పూలమొక్కలు నాటారు.