
సమస్యలు చర్చకు వచ్చేనా?
వరంగల్ అర్బన్: చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. ప్రధాన నాలాల విస్తరణ, ఆధునీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధా న కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంట లకు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగనుంది. 5 ఎజెండా, 19 సప్లిమెంటరీ ఎజెండాలోని అంశాలను ప్రవేశపెట్టనున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు చర్చకు వస్తేనే పరి ష్కారం లభిస్తుంది. అధికారులు, సిబ్బందిలో జవా బుదారీతనం పెరుగుతుంది. కానీ, కొన్ని సంవత్సరాలుగా గ్రేటర్ కౌన్సిల్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరగడం లేదు. కేవలం ఎజెండాలోని అంశాలను చదివి వినిపించడం, పెద్దగా చర్చ లేకుండానే అధికార పక్షం చప్పట్లతో ఆమోదించడం, నామామాత్రపు నిరసనలకే ప్రతిపక్షాలు పరిమితమవుతున్నాయి.
నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం