
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా వైద్యవృత్తికి న్యాయం చేకూరుతుందని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వైద్యులకు సూచించారు. మంగళవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని కలెక్టరేట్‌లో కేక్ కట్ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రతీ పేదవాడికి వైద్యం అందాలని, ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేయాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్‌రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారులు మంజుల, డాక్టర్ అహ్మద్‌లను శాలువాలతో సత్కరించారు. వైద్యుల క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రశంసపత్రాలు, కప్ బహూకరించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.