
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ఆత్మకూరు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని అక్కంపేటలో ప్రాథమిక పాఠశాల, జెడ్పీ హైస్కూల్, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి రికార్డుల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగిందా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కేస్‌స్టడీలు నమోదు చేస్తున్నారా? అని తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా? అని తెలుసుకున్నారు. మండలంలోని తిరుమలగిరిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని, నర్సరీని పరిశీలించారు. కేజీబీవీలో వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పీహెచ్‌సీని పరిశీలించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. అక్కంపేటలో రోడ్డు సౌకర్యం కల్పించడానికి ప్రతిపాదనలు చేయాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీఈఓ వాసంతి, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసరావు, కేజీబీవీ జీసీడీఓ సునిత, తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఓ విజయ్‌కుమార్, ఈజీఎస్ ఏపీఓ రాజిరెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వాసవి, అక్కంపేట హెచ్‌ఎం ఉపేందర్‌రెడ్డి, ఐసీడీఎస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్