వరంగల్ క్రైం: వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్ సోమవారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. పేదలకు సత్వరమే న్యాయం అందించేలా కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంచాలని ఏఎస్పీకి సూచించారు.
పరిశోధన కేంద్రంగా పింగిళి మహిళా కళాశాల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని ప్రభుత్వపింగిళి మహిళా కళాశాలను రీసెర్చ్‌సెంటర్‌గా గుర్తించారు. ఈమేరకు హిస్టరీ విభాగం పరిశోధనకు పర్యవేక్షకులుగా ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ ఎల్.ఇందిరను నియమించినట్లు కేయూ సోషల్ సైన్స్ డీన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ సోమవారం వెల్లడించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ కోల శంకర్ పాల్గొన్నారు.
నేటి నుంచి టికెట్ రిజర్వేషన్‌కు ఆధార్ తప్పనిసరి
కాజీపేట రూరల్: భారతీయ రైల్వే జూలై 1 నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం రాత్రి స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి ఆన్‌లైన్ టికెట్ విధానంలో, జూలై 15 నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారు తప్పకుండా ఆధార్ జత చేయాలని పేర్కొన్నారు. వారి ఫోన్ నంబర్ కూడా ఆధార్‌కు లింక్ అయ్యి ఉండాలని రైల్వే శాఖ ఉత్తర్వులు అమలు చేసినట్లు తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన
ప్రభుత్వ ప్రత్యేక పీపీ
వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్‌గా నియమితులైన ఎడవల్లి సత్యనారాయణ సోమవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పీపీ నర్సింహారావు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడర్ నూకల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
నేడు తూమాటి దొణప్ప శతజయంత్యుత్సవాలు
హన్మకొండ కల్చరల్: ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి కమిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యక్షులు దొణప్ప శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు జిల్లా కవులు, సాహితీవేత్తలు పాల్గొనవలసిందిగా కోరారు.

సీపీని కలిసిన ఏఎస్పీ