
పరకాల సబ్‌జైలు తనిఖీ
పరకాల: పరకాల సబ్‌జైలును జిల్లా జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన ఖైదీలందరినీ కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. ఆయన వెంట జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ క్షమా దేశ్‌పాండే, పరకాల జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్, పరకాల జైల్ సూపరింటెండెంట్ భగవాన్‌రెడ్డి, లీగల్ ఎయిడెడ్ కౌన్సిల్ ఎం.కవిత, స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు.
పరకాల కోర్టు పరిశీలన
సబ్‌జైలును పరిశీలించిన అనంతరం పరకాల కోర్టు ను జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు పరిశీలించారు. న్యాయవాదుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.