
వైద్యాధికారులకు సమ్మె నోటీసు అందజేత
గీసుకొండ: దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆ రోజు తాము విధులకు హాజరు కావడం లేదంటూ ఏఐటీయూసీ నాయకులు శనివారం నర్సంపేట, వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ ఐ.ప్రకాశ్, డాక్టర్ కొమురయ్యకు సమ్మె నోటీసు అందజేశారు. సార్వత్రిక సమ్మెలో జాతీయ ఆరోగ్యమిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొంటారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేశ్, ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియ న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేశ్‌ఖన్నా తెలిపారు. ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. యూనియన్ ఉపాధ్యక్షుడు ఆచంట అభిషేక్, జిల్లా అధ్యక్షులు జన్ను కొర్నేలు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు యాకూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
కొమ్మాల ఆలయ
ఆదాయం రూ.8.39 లక్షలు
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచి 80 రోజలపాటు రూ.8,39,225 ఆదాయం సమకూరిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. శనివారం ఆలయంలో లెక్కించగా హుండీల ద్వారా రూ.2,44,200, పలు రకాల ఆర్జిత సేవల ద్వారా రూ.5,95,025 ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకుడిగా డి.అనిల్‌కుమార్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్ర, ఆలయ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ వీరాటి లింగారెడ్డి, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు
విక్రయిస్తే కఠిన చర్యలు
రాయపర్తి: నకిలీ విత్తనాలు అమ్మితే కేసులతోపాటు కఠిన చర్యలు తప్పవని రెండో అదనపు న్యాయ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి హారిక హెచ్చరించారు. విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులు, విత్తన డీలర్లకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లో అమ్ముతున్న ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను కొనుగోలు చేయవద్దని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో లీగల్ అడ్వయిజర్ రజిని, వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివా స్,ఎస్సై ముత్యం రాజేందర్, ఏఓ గుమ్మడి వీరభద్రం,ఏఈఓలు,రైతులు,డీలర్లు పాల్గొన్నారు.
గంజాయి స్వాధీనం
వర్ధన్నపేట: గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన వర్ధన్నపేటలో జరిగింది. ఎస్సై చందర్ కథనం ప్రకారం.. వర్ధన్నపేటలోని వరంగల్ ఖమ్మం రహదారిలో ఉన్న ఓ స్కూల్ వద్ద శనివారం తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా పల్సర్ బైక్‌పై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేశారు. రూ.1,36,000 విలువైన రెండు కిలోల 720 గ్రాముల గంజాయి, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా ముస్తాఫానగర్‌కు చెందిన నిందితులు అఫ్రోజ్, మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చందర్ తెలిపారు.

వైద్యాధికారులకు సమ్మె నోటీసు అందజేత

వైద్యాధికారులకు సమ్మె నోటీసు అందజేత