
ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కృషి
నర్సంపేట రూరల్: ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం నర్సంపేటలోని వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్, వివిధ విభాగాధిపతులతో శనివారం సమీక్ష నిర్వహించారు. వైద్య కళాశాలలో బోధన, బోధనేతర, ల్యాబ్, సిబ్బంది, కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రికి సంబంధించి ఓపీ విభాగం, ఆరోగ్యశ్రీ తదితర విభాగాలను సందర్శించారు. వివిధ విబాగాల్లో వనరుల కొరత, యూజీ మెడికల్ ఎడ్యుకేషన్, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన, సమకూర్చాల్సిన సౌకర్యాలపై క్షుణ్ణంగా చర్చించారు. ఆస్పత్రికి, వైద్య కళాశాలకు డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బంది, ఇతర పరికాలపై అడిగి తెలుసుకున్నారు. ఐపీ సేవలు తర్వితగతిన ప్రారంభించాలని, వాటికి కావాల్సి వసతుల కల్పనకు కలెక్టర్ కృషి చేస్తారని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.కిషన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రీదేవి, పలు విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
కమిషనర్ డాక్టర్
సంగీత సత్యనారాయణ

ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కృషి