పురుగు మందుల దుకాణాలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

పురుగు మందుల దుకాణాలపై దాడులు

Jun 28 2025 5:21 AM | Updated on Jun 28 2025 7:16 AM

పురుగ

పురుగు మందుల దుకాణాలపై దాడులు

దుగ్గొండి: పురుగు మందుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్‌, దుగ్గొండి పోలీసులు శుక్రవారం సంయుక్తంగా దాడులు చేశారు. అనుమతి లేని, కాలం చెల్లించిన రూ.1.25 లక్షల విలువైన మందులు పట్టుకున్నారు. మండల కేంద్రంలోని లక్ష్మీగణపతి పెస్టిసైడ్స్‌లో రూ.25,770 విలువవైన అనుమతి లేని గడ్డిమందు, గడువుతీరిన మందులను పట్టుకున్నారు. వెంకటేశ్వర పెస్టిసైడ్స్‌ షాపులో రూ.48,660 విలువైన అనుమతి లేని మందులు, గడువుతీరిన మందులు, చంద్రయ్యపల్లి గ్రామంలో ఆగ్రోస్‌ సేవా కేంద్రంలో రూ.51,488 విలువైన గడువు తీరిన మందులు, అనుమతిలేని గడ్డి మందులు పట్టుకున్నారు. పట్టుకున్న మందులను దుగ్గొండి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అనుమతిలేని మందులు విక్రయించిన కర్రె దేవేందర్‌, భట్టు నాగరాజు, బాషబోయిన రాజుపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీదర్‌, దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫర్టిలైజర్‌ షాపు

యజమానిపై కేసు

నల్లబెల్లి: మండలంలోని రేలకుంటలో దేవా సుధీర్‌బాబు ఫర్టిలైజర్‌ షాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవా సుధీర్‌ తన షాపులో గడువు తీరిన పురుగు మందులు, ఎరువులు నిల్వ చేశాడనే విశ్వసనీయ సమాచారంతో గురువారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారని తెలిపారు. గడువు తీరిన రూ.14,95,993 విలువైన ఎరువులు, పురుగు మందులను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. ఏఓ రజిత బన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

మురుగు కాల్వలుకబ్జా చేస్తే చర్యలు

నల్లబెల్లి: మురుగు కాల్వలు కబ్జా చేసి వాటిపై అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి కల్పన హెచ్చరించారు. మండల కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులను పంచాయతీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ము రుగు కాల్వలపై అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఎంపీఓ రవి, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్‌కు సూచిందారు.

జిల్లాలో 60.73 శాతం ఉత్తీర్ణత

విద్యారణ్యపురి: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో 60.73 శాతం ఉత్తీర్ణత సాధించారని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్‌ తెలిపారు. జిల్లాలో మొత్తంగా 685 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. అందులో 416 మంది ఉత్తీర్ణత (60.73 శాతం) సాధించారని పేర్కొన్నారు. బాలురు 455 మందికి 270 మంది, బాలికలు 230 మందికి 146 మంది ఉత్తీర్ణత సాధించారని డీఈఓ తెలిపారు.

మధ్యవర్తిత్వ ప్రత్యేక

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా వాణి

వరంగల్‌ లీగల్‌: హనుమకొండ జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వ కేసుల ప్రత్యేక గవర్నమెంట్‌ ప్లీడర్‌ (స్పెషల్‌ జీపీ)గా న్యాయవాది పోలసాని వాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాసన – న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం మూడేళ్ల వరకు వర్తిస్తుందని, నెలకు రూ.60 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన పోలసాని వాణి 18 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈమె జీవిత భాగస్వామి శ్రీనివాసరెడ్డి కూడా న్యాయవాదే. ఈసందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పురుగు మందుల దుకాణాలపై దాడులు
1
1/2

పురుగు మందుల దుకాణాలపై దాడులు

పురుగు మందుల దుకాణాలపై దాడులు
2
2/2

పురుగు మందుల దుకాణాలపై దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement