
స్థల సర్వేను త్వరగా పూర్తిచేయాలి
ఖానాపురం: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కావాల్సిన స్థల సర్వేను త్వరగా పూర్తిచేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని అశోక్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం అధికారులతో కలిసి శుక్రవారం స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థలం హద్దులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ స్థలానికి సంబంధించిన సర్వేను మూడు రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందజేయాలన్నారు. సైనిక్ స్కూల్ పరిధి నుంచి వెంటనే స్థలాన్ని తీసుకుని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్థలాన్ని అప్పగించిన వెంటనే ప్రభుత్వ సహకారంతో నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిందని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీఓ సునీల్‌కుమార్, ఎంఈఓ శ్రీదేవి, వైస్‌చైర్మన్ శాఖమూరి హరిబాబు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి