
పీడీ యాక్ట్ నమోదు సరైనదే..
గీసుకొండ: పరకాల ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధి గీసుకొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామానికి చెందిన ధారవత్ ధన్‌సింగ్ అనే గుడుంబా విక్రయదారుడి పై పీడీ యాక్ట్ సరైనదేనని హై కోర్టు తీర్పు వెలువరించిందని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు చర్లపల్లి జైలులో ఉన్న ధన్‌సింగ్‌కు అధికారులతో కలిసి ఆయన పీడీ యాక్ట్ పత్రాలను అందజేశారు. 2024 లో డిప్యూటీ కమిషనర్‌తోపాటు, రూరల్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఆదేశాల మేర కు అసిస్టెంట్ సూపరింటెండెంట్ మురళీధర్, సీఐ తాతాజీ నిందితుడి పై పీడీ యాక్ట్ నమోదు చేశారని తెలిపారు. కలెక్టర్ సత్యశారద ఉత్తర్వుల మేరకు గ తఏడాది నవంబర్ 25న నిందితుడిపై కేసు నమో దు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు. కాగా తన భర్త ధన్‌సింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడాన్ని సవాల్ చేస్తూ అతని భార్య హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ప్రమాదకరమైన గుడుంబా కేసుల్లో పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపటం సరియైనదేనని హైకోర్టు తీర్పు వెలువరించినట్లు అంజన్ రావు తెలిపారు. పలుమా ర్లు గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన ధన్ సింగ్ పై పీడీ చట్టం ప్రయోగించినందుకు వరంగల్ రూరల్ సూ పరింటెండెంట్ అరుణ్ కుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మురళీధర్, పరకాల సీఐ తాతా జీ, ఎస్సై జ్యోతిని ప్రత్యేకంగా అభినందించారు.
వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్
డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు