
యోగాతో మానసిక ప్రశాంతత
వరంగల్ లీగల్: ప్రతీ రోజు యోగా సాధన చేయడం వల్ల శారీరక ఉత్తేజంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ప్రాంగణంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో యోగా మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా నిర్మలా గీతాంబతో పాటు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శోభ బృందం ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు యోగాసనాలు వేసి, శ్వాస పద్ధతులు నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.