
పసుపు రైతుల ఆందోళన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేశారు. ధర పెంచేవరకూ పసుపు అమ్మమని తేల్చిచెప్పారు.
● శాయంపేట: ఈ చిత్రంలో కనిపిస్తున్నది బెంచీలు మోస్తూ కనిపిస్తున్నది శాయంపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు. ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. బరువైన పాత బల్లలను తరగతి గదుల నుంచి వేరే గదులకు మోయిస్తుండడాన్ని గురువారం ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. కాగా.. పాఠశాల ఆవరణలో చెత్త నిండి దుర్వాసన వస్తోంది. దోమలు విజృంభిస్తున్నాయి. అదేవిధంగా మండలంలోని పెద్దకోడెపాక ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం అందించిన స్కూల్ యూనిఫామ్ నాసిరకంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇష్టారీతిన కుట్టడంతో యూనిఫామ్ వేసుకునేందుకు ఇబ్బందవుతోందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.