
39 పాఠశాలలు.. 2,709 మంది విద్యార్థులు
గీసుకొండ: మండలంలో 27 ప్రాథమిక, 12 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 2,709 మంది విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో ఉన్నారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. కొత్త అడ్మిషన్లను ఇంకా ఆన్‌లైన్ చేయలేదు. అడ్మిషన్లు కొంతమేరకు పెరుగుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మూత్రశాలు, మరుగుదొడ్ల సమస్య లేదు. గట్టుకిందిపల్లి, నందనాయక్‌తండా, అనంతారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కోదాంట్లో పది మందిలోపే విద్యార్థులు ఉన్నారు. అనంతారం ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించగా నలుగురు విద్యార్థులే హాజరయ్యారు.