
సేవ చేయడం అదృష్టంగా భావిస్తా
రాయపర్తి: తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించి, సంక్షేమ పథకాలను అందేలా చూస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన తీసుకురాగా.. ఇప్పుడు ఇచ్చేది మొదటి విడత మాత్రమేనని రెండో విడతలో అర్హులందరికీ ఇళ్లు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నమ్మకంతో తనను గెలిపించినందుకు నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రూ.14 కోట్లతో మండల కేంద్రంలో మంజూరైన గోదాం పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పెర్కవేడు, కొత్తూరు, కొత్తతండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ తొర్రూరు అధ్యక్షుడు హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, టీఎం కృష్ణమాచార్యులు, నంగునూరి అశోక్, పెండ్లి మహేందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వనజారాణి, మందాటి సుదర్శన్‌రెడ్డి, ఎనగందుల మురళి, కుందూరు రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి