
భూగర్భ జలాలను సంరక్షించాలి
రాయపర్తి: భూగర్భ జలాలు సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా నోడల్ ఆఫీసర్ డి.చైతన్య పేర్కొన్నారు. తిర్మలాయపల్లి, కొండూరు, బురహాన్‌పల్లి, కాట్రపల్లి, కొలన్‌పల్లి, పోతిరెడ్డిపల్లి, కిష్టాపురం, మొరిపిరాల, సన్నూరు, మైలారం, రాయపర్తి, జగన్నాథపల్లి, ఏకేతండా గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన ఇంకుడుగుంతలు, ఫారంపాండ్ తదితర పనులను పరిశీలించి మాట్లాడారు. జల సంచాయ్–జల భాగిరథి కార్యక్రమంలో భాగంగా పనులు పరిశీలించినట్లు తెలిపారు. ఏపీఓ కుమార్‌గౌడ్, ఈసీ ప్రవీణ్, సీటీఏలు సురేశ్, సుధాకర్, టీఏలు కిషన్‌రెడ్డి, వెంకన్న, యాకూబ్, సందీప్, పంచాయతీ కార్యదర్శులు వినోద్, విజయేందర్, రాజు, మహేందర్, అంబేడ్కర్, రాకేశ్, ఆస్మా, రాధిక, వెంకటేశ్, ఫీల్డ్‌అసిస్టెంట్లు యాకలక్ష్మి, సుధాకర్, కవిత, అరుణ, సృజన, దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.