
నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి
శాయంపేట : ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వాహకులు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని డీఈఓ వాసంతి సూచించారు. మండలంలోని మాందారిపేట శివారులోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పాఠశాలలోని వంట గదిని, పప్పు దినుసులు, ప్రయోగశాల, మరుగుదొడ్లు, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీని పరిశీలించారు. వేసవి సెలవులకు వెళ్లిన విద్యార్థులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంఈఓ భిక్షపతి, స్పెషల్ ఆఫీసర్ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
డీఈఓ వాసంతి

నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి