
యంగ్ ఇండియా స్కూల్‌తో నాణ్యమైన విద్య
వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లతో వర్ధన్నపేటకు కేటాయించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఈ మేరకు స్కూల్ నిర్మాణానికి వర్ధన్నపేట గువ్వలబోడు ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గువ్వలబోడులోని 118 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తోపాటు మున్సిఫ్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నా ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయారని వివరించారు. స్థానిక దళిత, గిరిజన రైతులు ముందుకు వచ్చి భూములు ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. గువ్వలబోడు ప్రాంతం నిర్మాణాలకు అనువుగా ఉండడంతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభమై, విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గ విద్యాభివృద్ధికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మైలురా యిగా నిలుస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు