
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
వరంగల్ అర్బన్: అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నగరవాసులకు మెరుగైన సేవలు అందించాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తమతమ విభాగాల పనితీరును వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల మరమ్మతులు పక్కాగా చేపట్టాలని మేయర్, కమిషనర్ ఆదేశించారు. అనంతరం సఫాయిమిత్ర కార్మికులకు పీపీఈ కిట్లను వారు పంపిణీ చేశారు.
మేయర్ గుండు సుధారాణి,
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్