
ఇందిరమ్మ ఇల్లు రాలేదని..
● వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన
పర్వతగిరి: మండలంలోని చెరువుకొమ్ముతండాలో సోమవారం ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో గ్రామానికి చెందిన ధారావత్ సుమన్ అనే వ్యక్తి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చే వరకు దిగేది లేదని సుమన్ స్పష్టం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సుమన్ నచ్చజెప్పి కిందికి దించారు. అనంతరం ఎస్సై బోగం ప్రవీణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడు సుమన్ మాట్లాడుతూ గతంలో తన ఇల్లు విద్యుదాఘాతంతో కాలిపోయిందని, అర్హులైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని అన్నారు.