భూభారతితో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూభారతితో సమస్యల పరిష్కారం

Jun 17 2025 4:47 AM | Updated on Jun 17 2025 4:47 AM

భూభారతితో  సమస్యల పరిష్కారం

భూభారతితో సమస్యల పరిష్కారం

పర్వతగిరి: భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌, వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సోమవారం పర్వతగిరిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించి రైతుల నుండి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ భారతితో భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్‌నాయక్‌, తహసీల్దార్‌ వెంకటస్వామి, రైతులు పాల్గొన్నారు.

మోహన్‌రావు సేవలు

చిరస్మరణీయం

నర్సంపేట రూరల్‌: ప్రముఖ పారిశ్రామిక వేత్త, నర్సంపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రి స్థల దాత దొడ్డ మోహన్‌రావు సేవలు చిరస్మణీయమని నర్సంపేట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దివ్వెల మోహన్‌దాస్‌ అన్నారు. నర్సంపేట మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో సూపరింటెండెంట్‌ కిషన్‌ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్స్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌, సిబ్బందితో కలిసి మోహన్‌రావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో మెడికల్‌ కళాశాల, ఆస్పత్రి నిర్మించేందుకు భూమిని కొనుగోలు చేసి దానం చేసిన మహోన్నతమైన వ్యక్తి దొడ్డ మోహన్‌రావు అన్నారు. ఇవే కాకుండా ఎన్నో సేవలు చేశారని, వారు భౌతికంగా లేకపోయిన ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ

ఫలితాల్లో 57శాతం ఉత్తీర్ణత

విద్యారణ్యపురి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో సెకండియర్‌ జనరల్‌ విభాగంలో 1,847 మంది విద్యార్థులకు గాను 977 మంది (57.9శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ శ్రీధర్‌సుమన్‌ తెలిపారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో బాలురు 1,104 మందికి గాను 562 మంది (50.91శాతం), బాలికలు 743 మందికి గాను 415 మంది (55.86శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు తెలి పారు. ఒకేషనల్‌ కోర్సులో 244 మందికి 157 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అదేవిధంగా ఫస్టియర్‌ జనరల్‌ విభాగంలో 2,820 మందికి గాను 1,780 మంది విద్యార్థులు (63.12 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. ఒకేషనల్‌ కోర్సులో 317 మందికి గాను 241 మంది ఉ త్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ తెలిపారు.

నామినేటెడ్‌

పోస్టుల్లో అన్యాయం

కొండా దంపతులపై

టీపీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు

వరంగల్‌: పార్టీని నమ్ముకున్న తమకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వకుండా కొండా సురేఖ దంపతులు అన్యాయం చేస్తున్నారని వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఏకరువు పెట్టారు. సోమవారం తూర్పు కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈసందర్భంగా పలువురు ఆయనతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్లను కాదని గత ఎన్నికల్లో, గెలిచిన తర్వాత పార్టీలో వచ్చిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించారు. ఈవిషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భద్రకాళీ దేవాలయ ట్రస్ట్‌బోర్డులో సైతం గెలిచిన తర్వాత వచ్చిన వారికి అవకాశం కల్పించారే తప్ప సీనియర్లను విస్మరించారని ఫిర్యాదు చేశారు. కాగా.. ‘తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు కల్పిస్తాం’ అని మహేష్‌కుమార్‌గౌడ్‌ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్‌ గుండేటి నరేంద్రకుమార్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ కార్పొరేటర్లు జన్ను అరుణ్‌, దూపం సంపత్‌, బిల్ల శ్రీకాంత్‌, జన్ను రవి, కరాటే ప్రభాకర్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొరిమి పరమేశ్‌, అర్బన్‌ అధ్యక్షుడు సలీం, వరుణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement