
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నల్లబెల్లి: రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ఘన విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నల్లబెల్లి, రంగాపూర్, రుద్రగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసిన వారికి దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్నారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తాహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, నాయకులు మాలోత్ రమేష్, వైనాల అశోక్, ఇస్తారి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇల్లు
దుగ్గొండి: నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తిమ్మంపేట గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు చెన్నూరి కిరణ్‌రెడ్డి, ఒలిగె నర్సింగరావు, దంజ్యానాయక్, శివాజి, తిరుపతి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి