
పాకాల ఆయకట్టు కింద త్వరగా నాట్లు వేయాలి
● అదనపు
కలెక్టర్ సంధ్యారాణి
ఖానాపురం: పాకాల ఆయకట్టు కింద త్వరగా నాట్లు వేసుకోవాలని రైతులకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. సోమవారం మండలంలోని ఖానాపురం, అశోక్‌నగర్, బుధరావుపేట గ్రామాల్లోని రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావులు రైతులకు పంటల సాగుపై పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ సంధ్యారాణి కూడా ప్రభుత్వ సూచనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సౌజన్య, తహసీల్దార్ రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, ఏఓ బోగ శ్రీనివాస్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.