
కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం
నల్లబెల్లి: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని నారక్కపేట, రాంపూర్, మేడపల్లి గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, వైనాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ చేతుల మీదుగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు అవార్డు
వరంగల్ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్‌క్రాస్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.
పోగొట్టుకున్న
ఫోన్ల అందజేత
నెక్కొండ: పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం అందించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల నుంచి దరఖాస్తులు తీసుకుని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేశామని చెప్పారు. సీపీఆర్‌ఎస్ ఆదేశాల మేరకు సుమారు లక్ష రూపాయల విలువైన ఫోన్లను గుర్తించి దిలీప్, కట్టయ్య, విజయ్‌పాల్, వినయ్, రాజుకు అందించామని ఎస్సై పేర్కొన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్సై అభినందించారు.
శ్రీరాం అష్టావధానం విజయవంతం
విద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర తెలుగు అవధానంలో ‘తె అక్షర ముష్టికా కథనం’ అనే సరికొత్త అంశాన్ని కంది శంకరయ్య ప్రవేశపెట్టగా చేపూరి శ్రీరాం విజయవంతంగా పూరించారు. అంశం అచ్చుల్లో ఉండగా సరైన హల్లులతో పూరించారు. అనంతరం చేపూరి శ్రీరాంను విద్యావికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ, శతావధాని చెన్నూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణపట్వర్ధన్, శతావధాని మురళి అభినందించారు. అవధానంలో సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజా మనోహర్‌బాబు, దహగం సాంబమూర్తి, విశ్రాంత డీఈఓ నున్నపురాజు రమేశ్వర్‌రాజు, అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, గుంటి విష్ణుమూర్తి, వెలుగు ప్రభాకర్, సిద్ధంకి బాబు పాల్గొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
నెక్కొండ: పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చంద్రుగొండలోని ఓ ఇంట్లో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం పోలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యాదగిరి, నాగరాజు, సురేశ్, శివకష్ణ, కుమారస్వామి పేకాడుతుండగా అరెస్టు చేశామని ఎస్సై చెప్పారు. వారి నుంచి రూ.2,070 నగదుతోపాటు నాలుగు సెల్‌ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం

కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం

కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం