హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ అయ్యా రు. ఆమె స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్‌లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న స్నేహ శబరీష్‌ను కలెక్టర్‌గా నియమించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె గతంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. స్నేహ శబరీష్ ములుగు జిల్లా ఎస్పీగా పని చేస్తున్న శబరీష్ సతీమణి. గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇక్కడి నుంచి బదిలీ అయిన 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పి.ప్రావీణ్య 2019–20లో కరీంనగర్ ట్రెయినీ కలెక్టర్‌గా, కొద్ది రోజులు జీహెచ్‌ఎంసీ లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వా త 2021 సెప్టెంబర్ 3 నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. 2023లో వరంగల్ కలెక్టర్‌గా ఉన్న గోపి బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో అదే ఏడాది మార్చి 13న ప్రావీణ్య నియమి తులయ్యారు. కాగా హనుమకొండ కలెక్టర్‌గా ఉన్న సిక్తా పట్నాయక్ 2024 జూన్ 16న బదిలీ కాగా.. ఆమె స్థానంలో వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్యను నియమించిన ప్రభుత్వం.. వరంగల్ కలెక్టర్‌గా సత్య శారదను నియామకం చేశారు. సుమారు ఏడాదిగా హనుమకొండ కలెక్టర్‌గా పనిచేసిన ప్రావీణ్య అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ముందు కు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు.
బల్దియా కమిషనర్‌పై బదిలీ వేటు..
ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన చాహత్ బాచ్‌పాయ్‌ని నియమించారు. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్విని తానాజీ వాకడేను 2023లో వరంగల్ అడిషనల్ కలెక్టర్ నుంచి బదిలీ చేసి వరంగల్ మున్సి పల్ కమిషనర్‌గా నియమించారు. బల్దియా అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యం చేయడం తదితర ఆరోపణలు ఎదుర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీ, స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీ తి, అక్రమాలు, టెండర్లు లేకుండా పనుల కేటా యింపు, బిల్లుల చెల్లింపుల్లో పర్సెంటేజీలు తదిత ర విషయాల్లో కీలక ప్రజాప్రతినిధికి వంతపాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను కరీంనగర్ అడిషనల్ కలెక్టర్‌గా నియమించారన్న ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా నియమితులైన చాహత్ బాచ్‌పాయ్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సతీమణి.
సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రావీణ్య బదిలీ
బల్దియా కమిషనర్‌గా
చాహత్ బాజ్‌పాయ్
అశ్విని తానాజీ
వాకడేపై బదిలీ వేటు..
కరీంనగర్ అడిషనల్ కలెక్టర్‌గా నియామకం
హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్
హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్
హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్


