బాధితులు చట్టపరమైన సాయం పొందాలి
డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ
కేయూ క్యాంపస్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు భయపడకుండా చట్టపరమైన సాయం పొందాలని వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ అన్నారు. కేయూ పరిపాలన భవనంలో యాంటీ సెక్సువల్ హరాస్మెంట్‌పై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రంగోళి పోటీలు, షార్ట్‌ఫిలిం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టీషీం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.సుజాత, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వి.శోభ తదితరులు పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు
న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, వరంగల్ కలెక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారి త్యాగాలు గుర్తించి, వారి సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. జనవరి 4న సూర్యాపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
న్యూశాయంపేట: ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సీపీఐ, సీపీఎం హనుమకొండ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్‌నారాయణ, వామపక్ష నేతలు కె.భిక్షపతి, చుక్కయ్య, ఎన్.హంసారెడ్డి, అప్పారావు, రాజేందర్, శ్రీనివాస్, టి.భిక్షపతి, ఎల్లేశ్, రాజమౌళి, వెంకటరాజం, స్టాలిన్, చక్రపాణి, ఉప్పలయ్య, తిరుపతి, సంపత్, భానునాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ సెంటర్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్, డీఆర్‌డీఏ)లో పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కందారి సారయ్య, కార్యదర్శిగా గుగులోతు వెంకన్న, ఉపాధ్యక్షులుగా గోలి కొమురయ్య, గుండేటి కుమారస్వామి, శారద, కోశాధికారిగా వనమ్మ, సహాయ కార్యదర్శులుగా రాజయ్య, సంపత్, యాకూబ్, కార్యవర్గ సభ్యుడిగా మెట్టు దాసు, సలహాదారులుగా అనిల్, రమేశ్, కందిక సుధాకర్‌ను ఎన్నుకున్నారు.
బాధితులు చట్టపరమైన సాయం పొందాలి
బాధితులు చట్టపరమైన సాయం పొందాలి
బాధితులు చట్టపరమైన సాయం పొందాలి


