వరంగల్
అక్రమార్కులు ఎవరు?
సబ్ ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అక్రమాలకు బాధ్యులను గుర్తించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురువారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
ఖిలా వరంగల్: నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 75 ఏళ్ల చరిత్ర ఉంది. 1950లో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు. దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 519 మంది విద్యార్థులకు 15 మంది ఉపాధ్యాయులు, 9 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు మాధవి విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నారు. ఈ సంవత్సరం పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధనతోపాటు మెరుగైన వసతులు ఉన్నాయి. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో చదివే ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులు అందజేస్తున్నారు. దీంతోపాటు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
కరీమాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల
ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్
● జిల్లాలో 2,49,510 పాఠ్యపుస్తకాలకు గాను 2,36,990 చేరుకున్నాయి. పర్యావరణ విద్యకు సంబంధించి పాఠ్యపుస్తకాలు రావాల్సింది.
● 1నుంచి 5వ తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్ 44,965కుగాను 35,231 వచ్చాయి.
● 2,21,750 నోట్‌బుక్స్ వచ్చాయి.
● 558 స్కూళ్లలో 33,878మంది విద్యార్థుల గాను యూనిఫామ్స్ 33,838 (99.8శాతం)
అందజేయనున్నారు.
న్యూస్‌రీల్
వరంగల్


