సంతోషంగా బడికి వెళ్లేవాడిని
మా నాన్న నన్ను పాఠశాలలో చేర్పించారు. సంతోషంగా బడికి వెళ్లే వాడిని. 1965 విద్యా సంవత్సరంలో పర్వతగిరి ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎస్‌సీ మొదటి సంవత్సరం ప్రారంభమైంది. 1968 సంవత్సరంలో నేను పాఠశాల టాపర్‌ను. 1968లో హెచ్‌ఎస్‌సీ పూర్తి చేయడం జరిగింది. ఉపాధ్యాయులు భాస్కరాచారి, పాణి, తోటి విద్యార్థుల సహకారంతో పాఠశాల భవనాన్ని శ్రమదానంతో నిర్మించడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో రూ.5కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మించి పాఠశాల రుణం తీసుకున్నా.
– కడియం శ్రీహరి, ఎమ్మెల్యే, స్టేషన్‌ఘన్‌పూర్
భయపడుతూ పాఠశాలకు వెళ్లేవాడిని
ఆరోజుల్లో పాఠశాలకు వెళ్లాలంటే భయపడే వాడిని. పాఠశాల తొలి రోజు మా నాన్న, మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి జగన్నాథరావు పాఠశాలలో చేర్పించారు. పాఠశాలకు వెళ్లిన తొలి రోజుల్లో భయం భయంగా గడపాల్సి వచ్చేది. పాఠశాల అభివృద్ధి కోసం నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.5 లక్షలు అందించాను.
– ఎర్రబెల్లి దయాకర్, మాజీ మంత్రి
●
సంతోషంగా బడికి వెళ్లేవాడిని


