రెస్కూ ్య.. సెవెన్ అవర్స్!
7 గంటల్లో ఇలా..
ఆదివారం ఉదయం 5గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. మొదట 5.41 గంటలకు తొగరి రక్షిత్, 6.50 గంటలకు పసుల రాహుల్, 9.45 గంటలకు కర్ణాల సాగర్, 10.07 గంటలకు మధుసూదన్, 11.16 గంటలకు రామ్‌చరణ్, 11.45 గంటలకు శివమనోజ్ మృతదేహాలను వెలికితీశారు. ఏఎస్పీ నరేశ్‌కుమార్, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సైలు పవన్‌కుమార్ పర్యవేక్షించారు. మృతదేహాలను అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ పరిశీలించారు. ఆయన వెంట డీటీ కృష్ణ, ఆర్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ సురేశ్ ఉన్నారు.
ఆరుగురు విద్యార్థుల
మృతదేహాలు లభ్యం
● తెల్లవారుజామున 5 నుంచి
మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపు
● మృతులందరివీ సాధారణ
కూలీ కుటుంబాలే
● తల్లిదండ్రుల రోదనలతో
దద్దరిల్లిన బ్యారేజీ పరిసర ప్రాంతాలు
● ప్రాణాలు తీసిన ఈత సరదా..
సెల్ఫీలపై ఆసక్తి!


