
చిన్నకొర్పోలులో వికటించిన వైద్యం
నెక్కొండ: వైద్యం వికటించి ప్రాణపాయం నుంచి ఓ బాధితుడు బయటపడ్డ ఘటన మండలంలోని చిన్నకొర్పోలు శివారు చెరువుముందరి తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు జిల్లా తెలంగాణ వైద్యమండలి దృష్టికి తీసుకెళ్లడంతో సూరిపల్లిలోని మహేశ్వర్ క్లినిక్, మండలం కేంద్రంలోని లావణ్య, రుద్ర, అమ్మ ఫస్ట్ ఎ యిడ్ సెంటర్లలో సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆజీర్మా తులస్య అలియాస్ తుల్చా ఏప్రిల్ 7న ఒళ్లు నొప్పులతో నీరసంగా ఉండడంతో చిన్నకొర్పోలులో ఫస్ట్‌ఎయిడ్ సెంటర్ నిర్వహిస్తున్న బర్మావత్ మోహన్‌ను సంప్రదించాడు. దీంతో తొంటికి ఇంజక్షన్ వేయగా అది గడ్డ కట్టింది. తీవ్రనొప్పి, జ్వరం రావడంతో మళ్లీ సంప్రదించాడు. వివిధ రకాల ఇంజక్షన్లతోపాటు సైలెన్లు పెట్టి చికిత్స చేశాడు. సమస్య జఠిలం కావడంతో కుటుంబ సభ్యులు 12న నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అత్యవసర పరిస్థితిలో రెండుసార్లు ఆపరేషన్ చేసి తొంటి, తొడ, కాలికి సోకిన ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించారు. మళ్లీ ఇన్‌ఫెక్షన్ సోకడంతో తొర్రూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ ఆపరేషన్ చే శారు. ప్రస్తుతం తులస్య ఆరోగ్యం కుదుట పడింది. కాగా, నకిలీ వైద్యుడు మోహన్‌పై చర్య తీసుకో వాలని బాధితుడి భార్య బుజ్జి తన బంధువుల సా యంతో పోలీస్ స్టేషన్‌తోపాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చదివిన మోహన్ మూడేళ్లుగా వైద్యం చేస్తున్నాడని తేలింది. సూరిపల్లి మహేశ్వర్ క్లినిక్ సెంటర్ నిర్వాహకుడు ఎం.రమేశ్, మండల కేంద్రంలోని అమ్మ, రుద్ర, లావణ్య ఫస్ట్‌ఎయిడ్ నిర్వహకులు డి.అశోక్, బి.రవి, ఎం.రమేశ్ ఆస్పత్రుల్లో కాంపౌండర్లుగా పనిచేసి, చట్టవిరుద్ధంగా చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. మోహన్‌తోపాటు మరో నలుగురిపై కేసునమోదు చేశారు. తనిఖీలో జిల్లా హెచ్‌ఆర్‌డీఏ అధ్యక్షుడు, ఐఎంఏ ఆంటీ క్వాకరీ కమి టీ సెక్రటరీ డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ నవీన్, ఎస్సై మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
తెలంగాణ వైద్య మండలి తనిఖీలు