
ధాన్యం దిగుమతి చేయాలని రాస్తారోకో
ఖానాపురం: మిల్లు వద్దకు చేరిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖానాపురం శివారులో మంగళవారం రైతులు ధాన్యం ట్రాక్టర్లతో రాస్తారోకో చేపట్టారు. రైతుల రాస్తారోకోకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సైలు రఘుపతి, పవన్ అక్కడకు చేరుకొని రైతులు, బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి రాస్తారోకో విరమింపజేశారు. సివిల్ సప్లయీస్ డీటీ సంధ్యారాణి, డీటీ రాజారేణుక, ఆర్‌ఐ స్వామి, ఏఎస్‌ఓ సుగుణ.. ధాన్యం దిగుమతి చేయించేందుకు మిల్లర్‌తో చర్చించారు. అయితే.. మిల్లులో స్థలం లేదని, తాను దిగుమతి చేసుకోనంటూ మిల్లర్ నిరాకరించారు. బుధరావుపేటలోని రైతు ఉత్పత్తిదారుల సంఘానికి చెందిన గోదాంలో దిగుమతి చేయించాలని సూచించినా మిల్లర్ వినిపించుకోలేదు. దీంతో రైతుల ధాన్యం దిగుమతి కాకుండా మిల్లు వద్దనే నిలిచిపోయింది. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌లు మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికార పార్టీ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కు కావడంతోనే రైతులను మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆరోపించారు. సోమయ్య, సుమన్, అశోక్, బాలు, రైతులు యాక య్య, నాగరాజు, ఈర్యనాయక్, కుమారస్వామి, ఎల్లస్వామి, వెంకన్న, భీమానాయక్ పాల్గొన్నారు.
అధికారులు చెప్పినా.. నిరాకరించిన మిల్లర్

ధాన్యం దిగుమతి చేయాలని రాస్తారోకో