
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఖానాపురం: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం నిర్వహించిన చైతన్య మండల సమాఖ్య వార్షిక మహాసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఈసందర్భంగా రుణాలు తీసుకొని పలు వ్యా పారాలు చేస్తూ ఆర్థిక అభివృద్ధి చెందుతున్న మహిళలను సన్మానించారు. ప్రభుత్వం నుంచి సంఘానికి మంజూరైన రూ.10.20 కోట్ల చెక్కును అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్‌రెడ్డి, ఏపీడీ రేణుకాదేవి, డీపీఎం అనిత, ఎంపీడీఓ సునీల్‌కుమార్, ఏపీఎంలు కందిక సుధాకర్, వేణు, అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి జ్యోతి, కోశాధికారి కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి