
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి
గీసుకొండ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుపొందేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బీజేపీ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, ఆరూరి రమేశ్, వన్నాల శ్రీరాములు, రాష్ట్ర, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీష్, రత్నం,సతీష్‌షా, వల్లాల వెంకటరమణ, కంభంపాటి పుల్లారావు, బాకం హరిశంకర్ పాల్గొన్నారు.
బీజేపీ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ