
ప్రశాంతంగా గ్రామ పాలన ఆఫీసర్ల పరీక్ష
హన్మకొండ అర్బన్: నగరంలోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూలో ఆదివారం జరిగిన గ్రామపాలన ఆఫీ సర్ల పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈపరీక్షకు 133 మంది అభ్యర్థులకు 122 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ తీ రును పరిశీలించేందుకు హనుమకొండ కలెక్టర్ ప్రా వీణ్య పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ నారాయణ, కలెక్టరేట్ ఏఓ గౌరీ శంకర్, చీఫ్ సూపరిటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో..
న్యూశాయంపేట: గ్రామపాలన అధికారి రాత పరీక్ష–25 ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. నగరంలోని ఇస్లామియా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 198మంది అభ్యర్థులకు 187 మంది హాజరై పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. 12 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఇస్లామియా కళాశాలను సందర్శించి కలెక్టర్ పరీక్ష జరుగుతున్న తీరు ను పరిశీలించారు. ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నా రు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీ ఆర్డీఓ విజయలక్ష్మి,ఏఓ సత్యప్రసాద్,తహసీల్దాదార్ ఇక్బాల్,చీఫ్ సూపరెండింట్ తదితరులు ఉన్నారు.