
హోర్డింగులు భద్రమేనా?
వరంగల్ అర్బన్: వానాకాలం రాకముందే గాలి దూమారం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు, మెరుపులు, వర్షంతో మహా నగరం ఆగమాగమవుతోంది. హోర్డింగులు, ఫ్లెక్సీలు, వృక్షాలు నేలమట్ట మవుతున్నాయి. నగరంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు భద్రమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటులో బల్దియా అధికారులు నిబంధనలు పాటించారా? తగు జాగ్రత్తలు చేపడుతున్నారా? అనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. జంక్షన్లలో, పలు భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనల హోర్డింగ్‌లను బల్దియా టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. నగర పరిధిలో చిన్న బస్ స్టాప్‌లు మొదలుకొని, రహదారులు, పెద్ద పెద్ద హోర్డింగ్‌ల వరకు ఎటు చూసినా భారీ వ్యాపార ప్రకటనలే కనిపిస్తున్నాయి.
నిబంధనలేం చెబుతున్నాయంటే..
నిబంధనల ప్రకారం జనసంచారం ఉన్న ప్రాంతా ల్లో, కూడళ్లలో బహిరంగ ప్రచారం నిషేధం. ట్రాఫి క్ సిగ్నల్స్ వాహనాలు మూలమలుపుల వద్ద ప్రభు త్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పార్కులు, శ్మశాన వాటికలు, ప్రధాన రహదారులపై ప్రచారాలను అనుమతించకూడదు. మహా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకుండా గోడలకు పత్రికలను కూడా అంటించకూడదు. దీన్ని ఎవరూ ఉల్లంఘించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం మహా నగర పాలక సంస్థ (జీబ్ల్యూఎంసీ), కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) నగర ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకునే అధికారం ఉంది. పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేయవచ్చు. లేకపోతే రూ. 5 వేలకు పైబడి జరిమానా విధించాలి. అయినప్పటికీ తీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనలు గాలికి..
ప్రజల రక్షణను బల్దియా గాలికి వదిలేస్తోంది. అనేక చోట్ల ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్, క టౌట్లతో ప్రమాదాలు జరుగుతున్నా బల్దియా అధి కారుల్లో చలనం లేదు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పా టు చేస్తున్న క్రమంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏదైనా ఒక భవనంపై హోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో పరిశీలించి అనుమతిచ్చిన త ర్వాతే ఏర్పాటు చేయాలి. భవనం పటిష్టత, హోర్డింగ్ ఐరన్,నిర్దేశిత సైజు,స్థాయిలో ఉందా లేదా? అనే ది చూడాల్సి ఉంటుంది. ఏదైనా లోపాలుంటే భవ న యాజమానులకు నోటీసులు జారీ చేసి,రద్దు చే యాలి. కానీ.. అధికారులు పరిశీలనను మరిచిపోయారు. కానీ కొందరు అధికారులు కొన్ని ప్రైవేట్ భవన యజమానులు, క్షేత్రస్థాయి సిబ్బందితో లో పాయకార ఒప్పందం చేసుకొని నిబంధనలు పాటించట్లేదు.
అనుమతి లేని హోర్డింగ్‌లు తొలగిస్తాం
నగరంలో అనుమతులు లేని హోర్డింగ్‌లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. అనుమతి లేకపోతే జరిమానా విఽధించడంతోపాటు తొలగిస్తాం.
– రవీందర్ వాడేకర్, బల్దియా సీపీ
నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రచారం
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?
బల్దియా అధికారుల తీరుపై
విమర్శలు
అనధికార హోర్డింగ్‌లే అధికం..
వరంగల్ ట్రైసిటీలో కూడళ్లు ఫ్లెక్సీలకు నిలయంగా మారాయి. కాజీపేట నుంచి మొదలుకొని హనుమకొండ, కాజీపేట వరకు ఎక్కడ చూసినా వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు ఇప్పటికే డివిజన్ల వారీగా జాబితా తయారు చేస్తే 1,200 వరకు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లున్నాయి. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే ఇష్టానుసారంగా హోర్డింగ్‌లను ఏర్పా టు చేస్తున్నారు. అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రకటనల బోర్డులపై చర్యలు తీసుకునేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సాహసించడం లేదు. యాడ్ సంస్థలకు ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారు.

హోర్డింగులు భద్రమేనా?