
మల్లన్నను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి సందర్శించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం.. అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం గర్భాలయంలో స్వామి వారి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు అయోధ్యరెడ్డి–జ్యోతిరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేయగా.. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి వారి శేషవస్త్రాలు, మల్లికార్జునస్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీఐ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబ సమేతంగా మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.