
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పర్వతగిరి/గీసుకొండ: పోలీస్ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని మామునూరు ఏసీపీ ఎన్.వెంకటేష్ సూచించారు. మామునూరు ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆదివారం పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్‌లో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేటాయించిన డ్యూటీలను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ బి.రాజగోపాల్, పర్వతగిరి ఎస్సై బి.ప్రవీణ్, ప్రొబేషనరీ ఎస్సై బి.స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.
గీసుకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఏసీపీ వెంకటేశ్.. స్టేషన్ పరిధిలోని కేసులు, సమస్యాత్మక ప్రాంతాలు, రికార్డుల నిర్వహణ తదితర విషయాలను సీఐ మహేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐతోపాటు ఎస్సై కె.కుమార్, సిబ్బంది.. ఏసీపీకి మొక్కలు అందించి స్వాగతం పలికారు.
మామునూరు ఏసీపీ వెంకటేష్