
ఎకై ్సజ్ శాఖ వేలంలో అవినీతి..?
వర్ధన్నపేట: ఎకై ్సజ్ శాఖ వేలంపాటలో అవినీతి జరి గిందనే ఆరోపణలు ప్రస్ఫుటంగా వినవస్తున్నాయి. వర్ధన్నపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు మంగళవారం వేలం నిర్వహించారు. ఆర్‌టీఐ నిర్ణయించిన ధరల ప్రకారం 23 బైక్‌లకు వేలం వేశారు. వీటితోపాటు మరో 13 స్క్రాప్ వాహనాలను వేలం వేశారు. 23 వాహనా లకు 15 వాహనాలు వేలంలో పోగా మిగతా వాహనాలకు ఎవరు ముందుకు రాలేదు.ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మురళీధర్ పర్యవేక్షణలో ఈ వేలం నిర్వహించారు. వేలంలో స్క్రాప్ వాహనా లతోపాటు జీఎస్టీతో కలిపి రూ.1,66830 ఆదా యం వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ స్వరూప వెల్లడించారు. కాగా, గతంలో స్క్రాప్‌లో వేలం పాడిన వాహనా లను అక్కడే గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి తీసుకునే విధంగా చేసేవారు కానీ, ప్రస్తుతం స్క్రాప్ వాహనాలను కట్ చేయకుండా నేరుగా ఇవ్వడంతో వేలంలో పాల్గొని దక్కించుకోనివారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరే వేలంలో పాల్గొనేలా చేసిన అధికారులు వారితో కుమ్ముకై ్క మామూళ్లు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. గతంలో స్క్రాప్ వాహనాలను కట్ చేయగానే ఫొటోలు మీడియాకు అందజేసేవారు. ప్రస్తుతం ఫొటోలు ఇవ్వకపోవడంపైనా.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్క్రాప్ పేర వసూళ్లు
చేశారంటూ ఆరోపణలు
సాక్షాత్తు జిల్లా ఉన్నతాధికారి
సమక్షంలోనే..!