
శ్మశానవాటికకు హద్దులు ఏర్పాటు చేయాలి
వరంగల్ దేశాయిపేట గ్రామశివారులోని సర్వే నంబర్ 308లోని ప్రభుత్వ భూమిలో ది పెంతెకోస్తు మిషన్ చర్చి దళిత క్రైస్తవులకు సంబంధించిన (సమాధుల స్థలం) శ్మశానవాటికకు హద్దులు పెట్టాలి. 1.35 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం 17 గుంటలు మాత్రమే మిగిలింది. స్థలాన్ని ఆక్రమించేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. హద్దులు పెట్టాలని రెండేళ్ల క్రితం ల్యాండ్ సర్వే అధికారులకు ఆదేశాలు జారీ అయినా ఇప్పటి వరకు హద్దులు ఏర్పాటు చేయలేదు.
– పెంతేకొస్తు చర్చి కమిటీ, దేశాయిపేట
●