భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన

Apr 5 2025 1:20 AM | Updated on Apr 5 2025 1:20 AM

భద్రక

భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన

హన్మకొండ కల్చరల్‌ : శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా శు క్రవారం ఎరుపు రంగు గులాబీపూలతో అమ్మవారికి అర్చన చేశారు. ఉదయం అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీతారాములకు తులసి అర్చన

హన్మకొండ కల్చరల్‌ : శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరో రోజు శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సీతారా ములకు లక్ష తులసిలతో అర్చన చేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన పూజా కార్యక్రమాల అనంతరం యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

పుష్‌పుల్‌ రైలు సర్వీసును

పునరుద్ధరించండి : ఎంపీ

హన్మకొండ చౌరస్తా: వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు పుష్‌పుల్‌ రైలు సర్వీసును పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ను ఎంపీ కావ్య కోరారు. ఈ మేర కు ఆమె శుక్రవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వెళ్తుంటారని, వారి అవసరాల దృష్ట్యా పుష్‌పు ల్‌ రైలు సర్వీసు పునరుద్ధరించడంతోపాటు బోగీల సంఖ్య పెంచాలని కోరారు. కాజీపేట లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండ గా.. ఇటీవల వరంగల్‌కు మంజూరైన సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను త్వరగా ప్రారంభించాలని ఎంపీ కావ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి రోలిసింగ్‌ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

ఎంజీఎం ఓపీ కౌంటర్‌లో

పనిచేయని ప్రింటర్లు

ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య రోగులను ఇబ్బంది పెడుతోంది. శుక్రవారం ఔట్‌ పేషెంట్‌ విభాగం అడ్మిట్‌ కార్డు కౌంటర్‌లో ప్రింటర్లు పనిచేయలేదు. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో బారులుదీరారు. ఉక్కపోతతో నరకం చూశారు. వారి ఇబ్బందిని చూసి సిబ్బంది గత్యంతరం లేక మాన్యువల్‌గా ఓపీ చిట్టీలు రాసి ఇచ్చారు. దీనిపై ఓ రోగి కుటుంబ సభ్యుడు సిబ్బందిని ప్రశ్నించగా ‘విషయం అధికారులకు చెప్పినా పట్టికోవడం లేదు.. మేం ఏం చేస్తామంటూ’ బదులిచ్చారు.

భద్రకాళి అమ్మవారికి  గులాబీలతో అర్చన1
1/3

భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన

భద్రకాళి అమ్మవారికి  గులాబీలతో అర్చన2
2/3

భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన

భద్రకాళి అమ్మవారికి  గులాబీలతో అర్చన3
3/3

భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement