
చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి
● పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుకొండ: పేదలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆయా కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని తన నివాసంలో గీసుకొండ మండలం నందనాయక్‌తండా, గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచుల వివాహానికి సహాయం అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గోలి రాజయ్య, మార్కెట్ మాజీ చైర్మన్ చింతం సదానందం, బీఆర్‌ఎస్ నాయకులు నాసం మల్లేశం, సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది అంశాల్లో
మరియపురం టాప్..!●
గీసుకొండ: జాతీయ పంచాయతీ అవార్డులు–2023 కోసం జిల్లా నుంచి 9 అంశాల్లో ఎంపిక చేసి పంపించిన ఉత్తమ గ్రామపంచాయతీలకు ఈనెల 25న హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పురస్కారాలు అందించనున్నారు. ఆయా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను మెమొంటోలు, సర్టిఫికెట్లతో సన్మానించనున్నారు. జిల్లాస్థాయిలో గీసుకొండ మండలం మరియపురం తొమ్మిది(అన్ని) అంశాల్లో టాప్‌గా నిలిచి.. రాష్ట్ర, జాతీయస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీల ఎంపికకు పోటీ పడుతోంది. అలాగే ఎలుకుర్తిహవేలి ఒక అంశం, నల్లబెల్లి మండలం నందిగామ 5, రాంపూర్ 5, నెక్కొండ మండలం దీక్షకుంట్ల 2, వెంకటాపూర్ 2, బొల్లికొండ 1, పర్వతగిరి మండలం కొంకపాక ఒకటి, ఏనుగల్లు ఒక అంశంలో పోటీ పడుతూ ముందు నిలిచాయి. ఈ గ్రామాలను జిల్లాస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా గుర్తించి పురస్కారాలు అందించనున్నారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను సన్మానించే కార్యక్రమం ఉంటుందని వరంగల్ కలెక్టరేట్ నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రస్థాయిలో ఎంపికై న పంచాయతీలకు ఈనెల 31న హైదరాబాద్‌లో పురస్కారం అందిస్తారు.
27న ‘నిధి ఆప్కే నికత్ 2.0’
హన్మకొండ అర్బన్: ఈపీఎఫ్‌ఓ సభ్యులు, యజమానులు, పెన్షనర్ల ఫిర్యాదులు పరిష్కరించేందుకు ఈనెల 27న నగరంలోని నిట్ క్యాంపస్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిధి ఆప్కే నికత్ 2.0 కార్యక్రమం నిర్వహించనున్నట్లు రీజినల్ పీఎఫ్ కమిషనర్ ప్రణీత్‌జోషి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎఫ్ సభ్యులు, యజమానులు, పెన్షనర్లు హాజరై ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు.
● 25న జిల్లాస్థాయి ఉత్తమ పురస్కారాల ప్రదానం