వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ నరేందర్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 2,506 మందికిగాను 2,367 మంది హాజరుకాగా 139 మంది గైర్హాజరయ్యారన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 932 మందికిగాను 868 మంది పరీక్షలు రాయగా 64 మంది హాజరుకాలేదని చెప్పారు.
పగిలిన
మిషన్ భగీరథ పైప్‌లైన్
అమరచింత: మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ పగలడంతో ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట, మదనాపురం మండలాల్లోని 30 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మదనాపురం మండలంలోని గోపాన్‌పేట వద్ద ఓ రైతు తన పొలం దుక్కి దున్నుతుండగా పైప్‌లైన్ పగిలి తాగునీరు వృథాగా పారింది. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ఈఈ అంజద్‌పాషా, డీఈ విజయ్‌కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన పైప్‌లైన్ పగలడంతో అమరచింత, ఆత్మకూర్ పురపాలికలతో ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల, బాలకిష్టాపూర్, మూలమల్ల, మదనాపురం మండలంలో మదనాపురంతో పాటు కొత్తపల్లి, దుప్పల్లి, గోపన్‌పేట, కర్వెన, భగత్‌సింగ్‌తండా, అమరచింత మండలంలోని సింగంపేట, మస్తీపురం, చంద్రప్పతండా, పాంరెడ్డిపల్లి తండా, కొంకన్వానిపల్లి, చిన్నచింతకుంట మండలంలోని అల్లీపురం, కురుమూర్తి, అమ్మాపురం, గూడూరు, తిరుమలాపురం, దాసరపల్లి, అప్పంపల్లి, ముచ్చింతల, చిన్నచింతకుంట, మద్దూరు, ఎదులాపురం గ్రామాల్లో శుక్రవారం నీటి సరఫరా నిలిచింది. అసలే వేసవి కాలం అందులోనూ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరమ్మతులు పూర్తిచేసి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
నిర్వహణ మరిచారు..
● ఆర్టీసీ బస్టాండ్‌లో వసతులు కరువు
● గ్రామాల్లో బస్సుషెల్టర్లు లేక ఇబ్బందులు
● పట్టించుకోని అధికారులు, పాలకులు


